భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: కొల్చారం మండలం చిన్న గణపూరు గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య ధాన్యం కొనుగోలు సమస్యల వల్లే మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తహశీల్దార్ నివేదిక ప్రకారం ఆ రైతు గుండెపోటుతోనే మరణించారని, కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సీరియల్ విధానంలోనే ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల…