భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామములో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సరిత మహేష్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వం కల్పించిన ఈ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ నర్సింలు, ఉప సర్పంచ్ వజ్జే పెంటయ్య, వార్డు సభ్యులు సత్యనారాయణ, నరసింలు, ప్రముఖ నాయకులు పట్లోల్ల…