భారత్ సమాచార్.నెట్, మెదక్ : రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హిమజ్యోతి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. పిల్లలు ఇంటి వద్ద సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ పెట్టేలా చూడాలని కోరారు. కళాశాలలో అన్ని వసతులు కల్పించామని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి బోధన చేస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా పిల్లలను కళాశాలకు పంపాలని కోరారు.…
విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి..





