భారత్ సమాచార్.నెట్: హిందీ భాషపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మాతృభాష అమ్మ అయితే.. హిందీ మన పెద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకల్లో హిందీని రాష్ట్ర భాషగా సమర్థిస్తూ దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. హిందీని రాష్ట్ర భాషగా అభివర్ణించారు.…





