భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం కేంద్రంలో వెల్దుర్తి నుండి మెదక్ గల రోడ్డును బాగు చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని మండలంలోని రామయపల్లి, బండ పోసానిపల్లి, ఎదులపల్లి, కలాన్ శెట్టిపల్లి గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం కాలాను శెట్టిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి దగ్గర్లో ఉన్న తమ గ్రామాల రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో తమ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ప్రజలు…