భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామపంచాయతీలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు పేర్కొంటున్న వీబీజీఆర్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గొడిషాల వెంకన్న మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ…





