భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డులో మటన్ మార్కెట్ వెనుక గల వీధిలో చెత్త పేరుకుపోయింది.  పరిసరాలు అపరిశుభ్రంగా మారి పందులు స్వైర విహారం చేస్తున్నాయి.  శుభ్రత లేక దుర్గంధంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.