భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా: దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు వనపర్తి జిల్లా పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరుల స్థూపం వద్ద జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పూలమాల వేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ, పోలీస్ సిబ్బందితో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజం సురక్షితంగా ఉండడానికి పోలీసుల…





