భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: భీమిని మండల పరిధిలోని పలు గ్రామాలకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. బెల్లంపల్లి డివిజన్ ఇంజనీర్ రాజన్న తెలిపిన వివరాల ప్రకారం 33/11 కేవీ కన్నెపల్లి ఫీడర్ లైన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మధ్యాహ్నం 2:45 గంటల నుంచి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం





