భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రజలంతా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సంబరమని, అయితే ఆనందంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో కరెంట్ వైర్లు,…