భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాల తమ విద్యార్థులు చేసిన యాక్టివిటీలతో కూడిన క్యాలెండర్లను ముద్రించడం అభినందనీయమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం యుపిఎస్ హెచ్ఎం నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తమ విద్యార్థుల ప్రతిభను చాటుతూ వినూత్న పద్ధతిలో 2026 క్యాలెండర్లను ప్రింట్ చేయించారు. వీటిని గురువారం జిల్లా కేంద్రం మానుకోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళి నాయక్ మాట్లాడుతూ.. హెచ్‌ఎం నరేంద్రకుమార్‌తోపాటు టీచర్స్‌ను…