భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని గౌతమ్ నగర్ సీతారామయ్య వెంచర్‌లో ఇటీవల ప్రారంభమైన సాహిల్ క్రికెట్ అకాడమీని MDR ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అకాడమీ నిర్వహణ, కోచ్‌లు, యువ క్రికెటర్లను నేరుగా కలిసి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్థానిక యువ ప్రతిభను రాష్ట్ర, దేశ స్థాయికి తీసుకెళ్లేందుకు అకాడమీ చేస్తున్న కృషిని పృథ్వీరాజ్ అభినందించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ధైర్యం పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు.…





