భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుజాతనగర్ పోలీసులు సుజాతనగర్ సెంటర్ నుండి లక్ష్మిదేవిపల్లి, ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు భారీ బైకు ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఈ ర్యాలీని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన యువత పడకుండా,వారికి అవగాహన కల్పించడం,గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టడం వంటి…
మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి: ఎస్పీ రోహిత్ రాజ్





