భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అక్టోబర్ 12 నుండి 14 వరకు నిర్వహించే పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 1,88,895 మంది 0-5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లు వీరందరికి పల్స్ పోలియో చుక్కల మందు వేయాల్సి ఉందని ,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సర్వే ద్వారా అంచనా…