భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచెడ్ మండలం అంతారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ. రమేష్ గౌడ్ రూ.50,100 విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, ప్రకాష్ గౌడ్, చిన్నమల్లాగౌడ్, యాదగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రమేష్ గౌడ్ విరాళం అందజేత





