భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగి కృష్ణ మరోసారి అండగా నిలిచాడు. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ కూతురు మానస వివాహం సందర్భంగా వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగి కృష్ణ చేతుల మీదుగా పుస్తెమట్టెలు అందజేశారు. పెళ్లి ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబానికి ఆర్థిక సాయం అందడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తోడుగా…
పేదింటి ఆడబిడ్డకు పుస్తెమెట్టెలు అందజేసిన రంగి కృష్ణ





