భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఎంబీసీ కులాల కార్పొరేషన్ వ్యవస్థీకృత పనుల పురోగతిపై జిల్లా అధికారులతో జిల్లా ఎంబీసీ అధ్యక్షులు పీ.అజయ్ కుమార్, జంగమ సమాజం జిల్లా అధ్యక్షులు గణాచారి శివకుమార్ అప్ప కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పారదర్శక విధానాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని ఎంబీసీ కులాల సమస్యలు, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి,…