భారత్ సమాచార్.నెట్, మెదక్ : రామాయంపేటలోని రైతు వేదికలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు అనేది ఆయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు లొంగకుండా నీతిగా ఓటు వేసి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే ఈ…