భారత్ సమాచార్.నెట్, మెదక్: కౌడిపల్లి-కొల్చారం మధ్యగల లోతు వాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నర్సాపూర్ నుంచి మెదక్ వైపు దూసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న గొర్రెల మందపైకి వేగంగా దూసుకెళ్లడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

ఈ ప్రమాద దృశ్యం చూసి గొర్రెల యజమాని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

 

 

మ‌రిన్ని…