భారత్ స‌మాచార్.నెట్, వరంగల్ జిల్లా : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా, డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయారు. హన్మకొండ జిల్లా వంగపాడుకు చెందిన రూబెన్, 1979లోనే ఉద్యమంలో చేరి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో కీలక భూమిక పోషించారు. సుమారు 46 ఏళ్ల అనుభవం ఉన్న రూబెన్… మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం తగ్గడం, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవడం,…