భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) షెడ్యూల్ విడుదలతో సర్పంచుల (Sarpanch salary) గౌరవ వేతనం మళ్లీ చర్చకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పాలనలో కీలక పాత్ర పోషించే సర్పంచులు ప్రస్తుతం నెల (Sarpanch salary)కు రూ.6,500 గౌరవ వేతనం పొందుతున్నారు. 2021కి ముందు ఈ మొత్తం రూ.5,000 మాత్రమే ఉండేది. గ్రామ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు నేతృత్వం వహించే సర్పంచులకు తక్కువ మొత్తమే ఇవ్వడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇక ఎంపీటీసీలకు కూడా సమానంగా రూ.6,500 చెల్లింపుచేస్తుండగా, జడ్పీటీసీ,…





