భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి, మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం గంగయ్య, ఉప సర్పంచ్ జ్యోతి, వీడీసీ ఛైర్మన్ గంగాధర్, జనని యూత్ సభ్యులు సత్యనారాయణ, బాలు తదితరులు పాల్గొన్నారు.