భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుందని, అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని ఆర్డీవో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ స్థానిక…