భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం సీతారాంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల బాల,బాలికలు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి స్టూడెంట్స్ కు పాఠాలు బోధించారు. అనంతరం హెచ్ఎం బి ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంఈఓ ఆంగోతు రాందాస్ హాజరయ్యారు. ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎంతో అనుభూతినిచ్చిందని సెల్ఫ్ గవర్నమెంట్ డే టీచర్స్ తమ మనోగతాన్ని చెప్పారు. ఎంఈఓ రాందాస్ మాట్లాడుతూ విద్యాభ్యాసం చేస్తూనే స్వయం పరిపాలన రోజు పాఠాలు చెప్పడం అభినందనీయమన్నారు.…
స్వయం పరిపాలన అభినందనీయం: ఎంఈఓ





