భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గుంటనక్క, గుంపు మేస్త్రీ కలిసే జై తెలంగాణ ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరిందని తాను అనుకోవడం లేదని, విచారణ వల్ల తనలాంటి బాధితులను న్యాయం జరుగుతుం దని భావించడం లేదని అన్నారు. ప్రభుత్వాలు తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపించారు.…