భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బస్టాండ్ ఆవరణలో ఎస్సై రంజిత్ కుమార్ సోమవారం తన సిబ్బందితో నర్సాపూర్ లోని బస్ స్టాప్ పరిసర ప్రాంతంలో పోలీస్ జాగిలముతో తనిఖీ చేయించారు. ప్రయాణికులకు ప్రయాణ సమయములో పాటించవలసిన తగు సూచనలూ, జాగ్రత్తలు తెలియజేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

హిందూవాహిని ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు