భారత్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : విద్యాలయం ప్రాంగణంలోనే ఒక ప్రధానోపాధ్యాయిని (హెచ్‌ఎం) పాము కాటుకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఎంపీపీఎస్ కోడిసెలమిట్ట పాఠశాలలో తీవ్ర కలకలం రేపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెచ్‌ఎం పి.సరిత పాఠశాల ఆవరణలో విధులు నిర్వహిస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. పాఠశాల లోపల పాము దాడి జరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి…