భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే సామాజిక ఆర్థిక సర్వే-2026ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సీహెచ్ సురేష్, గణాంక అధికారి పద్మజ ఆధ్వర్యంలో మండల ప్రణాళిక అధికారులకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ సిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీపీవో సురేష్ మాట్లాడుతూ.. 2026 డిసెంబర్ వరకు కొనసాగే ఈ సర్వే ద్వారా జిల్లాలోని ఉపాధి, నిరుద్యోగిత, కార్మిక శక్తి, అసంఘటిత రంగాల ఆర్థిక…





