భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలో జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిల్వలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జొన్నల కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను, ఆదేశాలను అధికారులు ఖచ్చితంగా పాటించాలన్నారు. జొన్నలు విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము…





