భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో శనివారం అనంత చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామికి ఆలయ పూజారి గిరి పంతులు, ఫణి పంతులు చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అనంత చతుర్దశి పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆలయ పూజారులు తెలిపారు. నేడు అనంతపద్మనాభ స్వామికి పూజలు చేస్తే మంచి…