భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ టౌన్‌లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎస్పీ కి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శ్రీరాముడిని దర్శించుకుని జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, జిల్లాలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండాలని ప్రార్థించారు. అలాగే సమాజంలో ఐక్యత, శాంతి వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు.పూజల అనంతరం అర్చకులు ఎస్పీ కి తీర్థప్రసాదాలు…