భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో శివ్వంపేట్ మండలం లచ్చిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాంత్ రెడ్డికి కండువా కప్పి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట్ మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.