భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న జీవహింస చేయరాదని, చికెన్, మటన్ నిర్వహకులు ఎలాంటి మాంసం విక్రయం చేయరాదని మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేష్ హెచ్చరించారు. ఆదివారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపాలిటీలోని మాంసం విక్రయ దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.