భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రథ సప్తమి సందర్భంగా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు చేయించినట్లు వీరప్ప గురుస్వామి తెలిపారు. సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం ద్వారా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతలు సరైన పద్ధతిలో ఉంటాయని, ఎలాంటి సమస్యలు దరి చేరవని అన్నారు. సూర్యనమస్కారాలతో మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు





