భారత్ సమాచార్ నెట్, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 11వ తేదీన లేదా గరిష్టంగా 20వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఈ నెల 10న తుది జాబితా వెలువడనుంది.
సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా నోటిఫికేషన్ జారీలో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎన్నికల…





