భారత్ సమాచార్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సత్కార కార్యక్రమాన్ని ఆలయ ఛైర్మన్ ఛాంబర్ నందు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడుతూ యూనియన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయనను ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.
ఆది శ్రీనివాస్ ను సన్మానించిన ఆలయ ఉద్యోగులు





