• 23, 24, 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్

  • నాలుగో విడత తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ

భారత్ సమాచార్, తెలంగాణ: గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 పోస్టులకు సర్టిఫి కెట్ వెరిఫికేషన్ నాలుగో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ కొనసాగుతుం దని కమిషన్ ప్రకటించింది.