భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారిని రాజగోపురంలో సరస్వతి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.