భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మత్తు పదార్థాలకు బానిస కావొద్దని ఓ యువకుడిని మందలించినందుకు తనపై కక్ష పెంచుకొని దాడి చేశారని గ్రామానికి చెందిన పోచయ్య ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తిపై గత రాత్రి రాకేష్ గౌడ్ అనే వ్యక్తి తమపై దాడి చేశారని పోచయ్య ఆరోపించారు. మేకల మంద వద్దకు వెళ్లిన తనపై ఒక్కసారిగా 15 మంది వ్యక్తులు దాడి చేశారని, తనకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన…