భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డి పదవి విరమణ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వీడ్కోలు సమావేశంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. రాంచంద్రారెడ్డి పోలీస్ కానిస్టేబుల్‌గా జిల్లా పోలీస్ శాఖలో 39 సంవత్సరాలుగా వివిధ పోలీస్ స్టేషన్లలో సాధారణ విధులతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. తనకు కేటాయించిన ప్రతి విధిని నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉన్నారు. సర్వీస్ కాలమంతా ఏ…