భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచలోని పాలకోయ తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో హెచ్‌ఎం వి.జ్యోతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక మహిళలు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పూజలు చేశారు. అనంతరం, బతుకమ్మ పాటలు పాడుతూ, ఉత్సాహంగా ఆటపాటలతో పాఠశాల ఆవరణలో సందడి చేశారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం వి.జ్యోతి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక…





