భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఈ నెల 19వ తేదీన (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో, ఈ నెల 19న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.