భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశిలలో ఒకటిగా భావించే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణాలు భక్తజనంతో కిటకిటలాడగా, ప్రత్యేక దర్శనాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి.

నెల్లికుదురులోని శ్రీ గోదా రంగనాయక స్వామి దేవాలయం, ఇనుగుర్తిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు,…