భారత్ స‌మాచార్.నెట్, న‌ల్గొండ‌ జిల్లా : దసరా పండుగ సందర్భంగా చందంపేట మండలం దేవరచర్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డిండి వాగులో పడి ప్రాణాలు కోల్పోయారు. సెలవుల నిమిత్తం బంధువుల ఇంటికి వచ్చిన సాయి ఉమాకాంత్ (10) స్నానం కోసం వాగులోకి దిగి వరద ఉధృతికి గల్లంతయ్యాడు.

బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించిన గోపి (21), రాము (30) కూడా వాగు ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల…