భార‌త్ స‌మాచార్‌.నెట్, నిర్మల్ జిల్లా : ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అడెల్లి మహపోచమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గంగ నీళ్ళ జాతర కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తునుద్దేశించి జిల్లా ఎస్పీ జానకి షర్మిల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమ్మవారి ఆభరణాల శుద్ధి కార్యక్రమం నుంచి దేవస్థానం చేరే వరకు ప్రతి దశలో పకడ్బందీ భద్రత అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.


ముఖ్యంగా గోదావరి ఘాట్ వద్ద వరద నీరు ఎక్కువగా ఉన్నందున పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని…