భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు తమ పరిచయాలను కలెక్టర్‌కు తెలియజేసి జర్నలిస్టుల సమస్యలు, యూనియన్ కార్యకలాపాలపై చర్చించారు.
టీజేఏ జిల్లా అధ్యక్షుడు మేకరబోయిన నాగేశ్వర్ యూనియన్‌కు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా సమాచార,…





