భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ప్రొఫెసర్ మోహన్ ధారావత్‌కు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్‌లోని కార్లోస్ III యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్, గెటాఫే క్యాంపస్‌లో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి దుబ్బ తండాకు చెందిన మాజీ జెడ్పీటీసీ తేజ నాయక్ కుమారుడైన డాక్టర్ మోహన్ ధారావత్ ప్రస్తుతం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్…