భారత్ సమాచార్ నెట్, నల్గొండ : నల్లగొండలో రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో త్రిపురారం ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పదవ తరగతి విద్యార్థినిలు సాయి వర్ష, తేజస్వినిలు రూపొందించిన ‘గాలిని శుద్ధి చేసే యంత్రం’ (Air Purifier), ‘కృత్రిమ జీవశాస్త్రం’ నమూనాలు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. ఈ ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ గర్వంగా ప్రకటించారు.


జిల్లా స్థాయి అధికారులు విద్యార్థినిల సృజనాత్మకతను అభినందించి, బహుమతులను అందజేశారు.…





