భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.. యాదగిరిగుట్ట (Yadagirigutta). ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా నిర్మితమైన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణలో ఏ ఆలయంలో లేని విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పునః నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణలోని ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఏపీలోని తీరుమల దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ దిశగా…