భారత్ సమాచార్, హైదరాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాలలో చదువుకునేందుకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 1950ల నుంచే పత్రికలు, గ్రంథాలు భద్రపరిచే కేంద్రాలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత భారీ సంఖ్యలో గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. గంటల తరబడి కళ్లలో ఒత్తులు వేసుకుని చదువుతూ తమ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నారు. నిశ్శబ్ద వాతావరణం, పుస్తకాల సమృద్ధి కారణంగా గ్రంథాలయాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎంతోమంది నిరుద్యోగులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు అవుతున్నారు.